Vishwambhara: ఆ ప్రపోజల్‌కు ఒప్పుకోని చిరంజీవి.. ‘విశ్వంభర’ రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara).

Update: 2024-10-11 09:03 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ‘విశ్వంభర’లో అనేక మంది స్టార్ హీరోలు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన అది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. అయితే.. ‘విశ్వంభర’ (Vishwambhara)కు సంబంధించి ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుండగా.. డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించాడు డైరెక్టర్ వశిష్ట (Vassishta). ఈ క్రమంలోనే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నామని గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే.. సంక్రాంతి బరి నుంచి ‘విశ్వంభర’ (Vishwambhara) తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలంగా భావిస్తున్న వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో హడావిడిగా పూర్తి చేసి సినిమా రిలీజ్ చేసే కంటే వాయిదా వేద్దాం అని చిరంజీవి(Chiranjeevi)కి తెలిపారట వశిష్ట (Vassishta). కానీ రాత్రి, పగలు కష్టపడైనా సరే ఈ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అని చెప్పారట చిరంజీవి. దీంతో డేట్ చేంజ్ అయినట్లు వస్తున్న వార్తలకు బ్రేక్ పడగా.. ఈ మూవీ సంక్రాంతికే వస్తున్నట్లు ఓ క్లారిటీకి వచ్చారు ప్రేక్షకులు. కాగా.. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Similar News