ఆ పోస్టర్‌లో సాయి పల్లవి ఎక్కడంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న పోస్ట్

స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-11-22 04:04 GMT

దిశ, సినిమా: స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె కేవలం సింగర్‌గానే కాకుండా ఎంతో మంది హీరోయిన్స్‌కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంతకి డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక చిన్మయి సమాజంలో జరిగే అన్యాయాలపై.. అలాగే ఆడవాళ్ళ పై జరిగే అఘాయిత్యాలపై ఆమె నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా చిన్మయి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా చిన్మయి ఎక్స్(ట్విట్టర్)లో రెండు సినిమాల పోస్టర్స్ షేర్ చేశారు. అందులో ఒకటి శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ మూవీ సక్సెస్ పోస్టర్, అలాగే ధనుష్ ‘మారి 2’ లోని రౌడీ బేబీ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్స్‌ను షేర్ చేస్తూ.. “దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన మహిళా కళాకారులకు సక్సెస్ పోస్టర్స్‌లో ప్లేస్ దక్కలేదు. అలాగే రౌడీ బేబీ సాంగ్ అద్భుతంగా పాడింది ధీ అనే మహిళా కళాకారిణి” అని చిన్మయి రాసుకొచ్చారు.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన అమరన్ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది అని అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించింది అని చెప్పవచ్చు. ఈ భామ నటనకు గాను అందరూ ఆమె నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అమరన్ సక్సెస్ పోస్టర్‌లో సాయి పల్లవి ఎక్కడ కనిపించలేదు. అలాగే ధనుష్ నటించిన ‘మారి 2’ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ ఆలపించిన ధీ ఫోటోను ఎక్కడా సక్సెస్ పోస్టర్‌లో షేర్ చేయలేదు. ఇక దీనిపైనే చిన్మయి తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Click Here For Twitter Post.. 

Tags:    

Similar News