ఏడుపు కథలు వినే ఓపిక లేదు.. విమర్శలపై నటి సీరియస్

దిశ, సినిమా: ప్రముఖ టీవీ నటి ఛవీ మిట్టల్ ఫొటోలపై వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టింది..Latest Telugu News

Update: 2022-07-15 09:22 GMT

దిశ, సినిమా: ప్రముఖ టీవీ నటి ఛవీ మిట్టల్ ఫొటోలపై వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత వక్షోజాలు, బొడ్డు కింద భాగం కనిపించేలా షేర్ చేసిన పిక్స్‌తో నీచమైన ట్రోలింగ్‌కు గురైంది. దీంతో తనదైన స్టైల్‌లో స్పందిస్తూ.. 'రెండు ఫొటోల్లో శరీరానికి సరిపడ ఖచ్చితమైన దుస్తులు ధరించాను. ఒక దాంట్లో నా బ్రెస్ట్ కొద్దిగా కనిపించింది నిజమే. అయితే పరిస్థితి అర్థం చేసుకోకుండా స్త్రీలు కూడా నన్ను విమర్శించడం బాధగా ఉంది.

నా వక్షోజాలతో నాకున్న అనుబంధం వివరించలేనిది. మృత్యువుతో పోరాడి వాటిని రక్షించాను. వాటిని దృఢంగా ఉంచడానికి కఠినమైన పోరాటం చేశాను' అని చెప్పుకొచ్చింది. అలాగే పనికిమాలిన మనుషుల ఏడుపు కథలు వినే ఓపిక తనకు లేదన్న ఛవీ.. సోషల్ మీడియా పేజీలు మూర్ఛ వ్యాధి‌గ్రస్తుల కోసం రన్ చేయట్లేదని కౌంటర్ వేసింది. 


Similar News