HMPV: ఈ ఆహారాలు తీసుకోండి.. కొత్త వైరస్ దరిదాపుల్లోకి కూడా రాదు!

కరోనా వైరస్(Corona virus) పోయిందనుకునేలోపే దేశంలో మరో కొత్త వైరస్ వచ్చి.. జనాల్ని వణికిస్తోంది.

Update: 2025-01-07 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్(Corona virus) పోయిందనుకునేలోపే దేశంలో మరో కొత్త వైరస్ వచ్చి.. జనాల్ని వణికిస్తోంది. ఆల్రెడీ ఇండియాలో నాలుగు హెచ్‌ఏంపీవీ(HMPV virus) కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ గురించి ఎక్కువగా భయపడాల్సిన అక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. అయితే ఈ వైరస్ మన దరిదాపుల్లోకి కూడా రావొద్దంటే ఈ ఆహారాలు తినాలంటున్నారు నిపుణులు. ఏఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

శ్వాసకోశ ఆరోగ్యానికి(Respiratory health) పోషకాలు పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు(Citrus fruits) తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సిట్రస్ పండ్లు మేలు చేస్తాయి. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. ద్రాక్షపండ్లు(Grapes), నారింజ, నిమ్మకాయలు వంటి సిట్స్ ప్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుందని సూచిస్తున్నారు.

వీటితో పాటు బెర్రీలు(Berries), టమాటాలు, బెల్ పెప్పర్స్, కెవి తీసుకోవాలి. ఇవి ఊపిరితిత్తుల కణజాలల్లో(Lung tissues) ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. యాంటీఆక్సిడెంట్లు దట్టంగా ఉండే గ్రీన్ టీ తాగాలి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు(Anti-inflammatory properties), యాంటమైక్రోబయల్(antimicrobial) ఉండే వెల్లుల్లి తినాలి. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. లంగ్స్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

అలాగే ఉదయం పూట పాలల్లో పసుపు వేసుకుని తాగాలి. పసుపులో యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వాపును తగ్గించి.. హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తాయి. ఆహారంలో అల్లం భాగం చేసుకోవాలి. వీటితో పాటు విటమిన్ సి, ఇ అధికంగా ఉండే ఆకుకూరలు తినాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదం తీసుకుంటే ఇమ్యూనిటి పవర్(Immunity power) ను అందిస్తాయి. విటమిన్ ఇ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన ప్రోటీన్లను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News