పిల్లలు వీటి లివర్ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు?
చికెన్, మటన్‌లలో వచ్చే లివర్ అంటే చాలా మంది ఇష్టపడుతారు.
దిశ, వెబ్‌డెస్క్: చికెన్(Chicken), మటన్(Mutton)లలో వచ్చే లివర్ అంటే చాలా మంది ఇష్టపడుతారు. అయితే పిల్లలు వీటిలోని లివర్ తినొచ్చా? అనే సందేహాలకు తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. లివర్‌లో కాడ్మియం(Cadmium), లెడ్(lead) వంటి లోహాలు ఉంటాయని.. ఇవి పిల్లల నరాల వ్యవస్థ పైన, మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. కొంతమంది పిల్లలకు చికెన్, మటన్ లివర్ తింటే అలర్జీ(Allergy) తలెత్తే అవకాశముందని చెబుతున్నారు.
నాన్ వెజ్‌తో బోలెడు లాభాలుంటాయి. మంచి పోషకాలు అందడమే కాకుండా ఆరోగ్యం బాగుంటుంది. కానీ పిల్లలకు మటన్, చికెన్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే జీర్ణ సమస్యలు(Digestive problems) తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే చికెన్, మటన్ లివర్ పిల్లలకు పెడితే నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. లివర్‌లో ఉండే యూరిక్ యాసిడ్ పిల్లల కిడ్నీల(kidneys)పై ప్రభావం చూపిస్తుందని వెల్లడిస్తున్నారు. మెదడుకు హాని కలిగించవచ్చని చెబుతున్నారు.
అలాగే లివర్ తింటే పిల్లల్లో దురద వచ్చే చాన్స్ ఉంటుంది. శ్వాస(breathing) తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. అంతేకాకుండా లివర్ లో కొలెస్ట్రాల్ స్థాయిలు(Cholesterol levels) అధికంగా ఉంటాయి. కాగా పిల్లల హెల్త్‌పై ప్రభావం చూపుతుంది. దీనిలో ఐరన్ శాతం కూడా అధిక శాతంలో ఉంటుంది కాబట్టి.. కాలేయం, హార్ట్ పై ఎఫెక్ట్ పడటమే కాకుండా పేగు సంబంధిత వ్యాధులు, వాంతులు, ఫీవర్, అలసట వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.