సీబీఐకి 'బిర్భూం దహనకాండ' కేసు
కోల్‌కతా: బిర్భూం సజీవదహానాల - Calcutta HC hands over probe to CBI, directs state govt to ‘extend full cooperation’
కోల్‌కతా: బిర్భూం సజీవదహానాల కేసులో కోల్ కతా హైకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి అప్పగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే నెల 7 లోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరింది. అనంతరం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కేసుపై ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్ర సంస్థకు అప్పగించాలని హైకోర్టును కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ, భరద్వాజ్ ల బెంచ్ స్పందిస్తూ.. సిట్ బృందం కేసు సంబంధిత ఫైళ్లను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. కేసులో మరింత పారదర్శకత విచారణ కోసం కేంద్ర సంస్థకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి దర్యాప్తును చేపట్టడంలో సీబీఐకి పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది.