అక్కను చంపిన తమ్ముడు.. అందుకు అడ్డుచెప్పిందనే..
దిశ, వెబ్డెస్క్: పదేపదే తనకు అక్క అడ్డు చెప్తోందని ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తనను వ్యతిరేకించిందని.. Latest Telugu News..
దిశ, వెబ్డెస్క్: పదేపదే తనకు అక్క అడ్డు చెప్తోందని ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తనను వ్యతిరేకించిందని కాల్చి చంపేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన నొయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల తమ్ముడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దాంతో 32 ఏళ్ల అక్క అతడిని మందలించింది. అతడి మద్యపాన అలవాటును మానుకోవాలని చెప్పింది. దాంతో నిందితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన అక్కతో వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య మాటా మాట పెరిగింది. అనంతరం తమ్ముడు తన వద్ద పిస్టల్ తీసి అక్కను కాల్చి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుడి కోసం నగరమంతా గాలిస్తున్నామని తెలిపారు.