అస్తవ్యస్థంగా బాలికల గురుకులం.. 350 మంది పట్టే పాఠశాలలో మరీ ఇంత మందా..!
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని బీసీ వెల్ఫేర్ బాలికల- latest Telugu news
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను బీజేపీ నేతలు, బీసీ విద్యార్థి సంఘం నేతలు ఆకస్మికంగా పరిశీలించారు. స్కూల్‌లో పారిశుధ్య నిర్వహణ పరిస్థితులు, శానిటేషన్ అధ్వాన్నంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ.. స్కూల్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆరోపించారు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 300మంది విద్యార్థినుల కెపాసిటీ కలిగిన పాఠశాల, హాస్టల్‌లో సుమారు 750మంది విద్యార్థినులను కుక్కి మరీ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. 750మందికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులకు టిఫిన్, భోజనం సకాలంలో అందడంలేదని, కాంట్రాక్టర్ కక్కుర్తితో సిబ్బందిని నియమించుకోవడంలేదని విమర్శించారు. పాఠశాల, హాస్టల్ నిర్వహణపై ప్రిన్సిపల్‌కు అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, బీజేపీ నేతలు తూళ్ల నర్సింహగౌడ్, బచ్చిగళ్ల రమేష్, ఎలిమినేటి నర్సింహారెడ్డి, నోముల కార్తీక్, మల్లెల ప్రేమ్‌సాయి, బీసీ విద్యార్థి సంఘం నేతలు ఆంజనేయులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.