పాస్కల్ సూత్రం కనిపెట్టిన 'బ్లైసీ పాస్కల్' జననం..

దిశ, ఫీచర్స్: ప్రముఖ శాస్త్రవేత్త ‘బ్లైసీ పాస్కల్’ 1962 జూన్ 19న ఫ్రాన్స్‌లో జన్మించాడు. 7 ఏళ్ల వయసు నుంచే జామెట్రీ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరచిన ఆయన..Latest Telugu News

Update: 2022-06-19 07:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రముఖ శాస్త్రవేత్త 'బ్లైసీ పాస్కల్' 1962 జూన్ 19న ఫ్రాన్స్‌లో జన్మించాడు. 7 ఏళ్ల వయసు నుంచే జామెట్రీ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరచిన ఆయన.. 12 ఏళ్లకే ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంతేకాదు 17 ఏళ్లకే 'యూనివర్సల్ థీరం ఆఫ్ జామెట్రీ' రూపొందించి ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు 'డెస్ కార్టెస్' చేత గొప్ప మేధావిగా మన్ననలు పొందడం విశేషం.

అకౌంటెంట్‌గా పనిచేసే తండ్రి కష్టాన్ని చూడలేకే ఆయన 'కాలిక్యులేటర్'ను ఆవిష్కరించాడు. అలాగే 'త్రిభుజాన్ని' కూడా ఆయనే నిర్మించగా ఇప్పటికీ 'పాస్కల్ త్రిభుజం'గా పిలుస్తున్నాం. దీని సాయంతోనే ప్రాబబిలిటీ సమస్యలను సునాయాసంగా పరిష్కరించవచ్చు. ఇక పాస్కల్ శాస్త్రవేత్త మాత్రమే కాదు తత్వవేత్త, రచయిత కూడా. మతపరమైన పుస్తకాలు రాసిన ఆయన.. జామెట్రీ, ప్రాబబిలిటీ, హైడ్రోస్టాటిక్స్, ఎంటగ్రల్ కాలిక్యులస్ అంశాల మీద ఎన్నో విలువైన పరిశోధనలు చేశాడు.


Similar News