బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ పోస్ట్ వైరల్
గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు(divorce) తీసుకుని విడిపోవడం కామన్ అయిపోయింది.
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు(divorce) తీసుకుని విడిపోవడం కామన్ అయిపోయింది. ఇక కొంతమంది అయితే కొద్ది కాలం డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కన్నడ నటి జయశ్రీ తన ప్రియుడితో విడిపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా, కన్నడ నటి, బిగ్‌బాస్ బ్యూటీ జయశ్రీ ఆరాధ్య(Jayashri Aradhya) ప్రియుడితో విడిపోయిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
స్టీవెన్‌తో డేటింగ్ చేసిన ఆమె అతనికి బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ‘‘అవును నాపై వచ్చే రూమర్స్ నిజం. నేను, నా బాయ్‌ఫ్రెండ్ స్టీవెన్(steven) విడిపోయాము. ఇక మీదట ‘ద గ్లామ్ రూమ్ మేకప్’(The Glam Room Makeup) క్లినిక్‌కు సంబంధించిన ఏ వివరాలకైనా నన్ను, నా టీమ్‌ను మాత్రమే సంప్రదించండి. ఈ మేకప్ క్లినిక్(Makeup Clinic) కోసం ఎవరితోనూ నేను చేయి కలపలేదు. బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా మొదలుపెట్టాను. ఆ అప్పు నేను తీర్చుకుంటాను. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ థాంక్స్’’ అని రాసుకొచ్చింది.