రెండు జిల్లాల్లో 150 బాంబులు.. సీఎం ఆదేశాల తర్వాతే..

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా జిల్లాలో ఒక్క బాంబు లభ్యమైతేనే జిల్లా అంతా హడలిపోతుంది.. Latest Telugu News..

Update: 2022-03-26 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా జిల్లాలో ఒక్క బాంబు లభ్యమైతేనే జిల్లా అంతా హడలిపోతుంది. ప్రజలంతా భయాందోళనలకు గురవుతారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కేవలం రెండు జిల్లాల్లో ఏకంగా 150 బాంబులు దొరికాయి. వీటిలో 50 క్రూడ్ బాంబులు కాగా మరో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాంబులు, పేలుడు పదార్థాలను సీజ్ చేయాలని డీజీపీ, ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇలా బిర్‌భుమ్స్ మార్‌గ్రం గ్రామంలో 50 బాంబులు, పాస్కిం మెదినిపుర్‌లో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..