Vatayanasana: వటయనాసనం.. దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసా?

Benefits Of Vatayanasana Yoga| మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లను ముందుకు చాచి రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు పాదాన్ని ఎడమ కాలు తొడపై పొట్టకు దగ్గరగా తీసుకొచ్చి బలంగా ఆన్చాలి. అలా పాదం కదలకుండా కుదురుకున్నాక ఎడమకాలు మోకాలి

Update: 2022-07-06 03:39 GMT

దిశ, ఫీచర్స్: Benefits Of Vatayanasana Yoga| మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లను ముందుకు చాచి రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు పాదాన్ని ఎడమ కాలు తొడపై పొట్టకు దగ్గరగా తీసుకొచ్చి బలంగా ఆన్చాలి. అలా పాదం కదలకుండా కుదురుకున్నాక ఎడమకాలు మోకాలి దగ్గర మడిచి పిరుదులపై బాడీ బ్యాలెన్స్ వేసి కూర్చోవాలి. ఇప్పుడు రెండు చేతులను నేలపై బలంగా ఆన్చి కుడికాలి మోకాలును నేలపై ఆన్చాలి. ఈ భంగిమలో వెన్నుపూస నిటారుగా ఉండాలి. తల ముందుకు చూస్తుండాలి. ఎడమకాలు పాదం నేలపై కుడికాలి మోకాలు ప్యారలల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చేతులను జోడించి పాములు అల్లుకున్నట్లు మెలిక తిప్పాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ మరో కాలుతో ప్రయత్నించాలి.

ప్రయోజనాలేంటి?

* కండరాల పట్టువిడుపులకు మేలు.

* ఎముకలను బలపరుస్తుంది

* రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

* సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది.

https://www.facebook.com/Ujala.Kataria2020/videos/vatayanasana-horse-pose-for-sexual-disorders-and-others-physical-benefits-yoga-l/3096022047141608/

Tags:    

Similar News