Plane Crash: కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు
క్రిస్మస్(Christmas) పండుగ వేళ ఘోర ప్రమాదం జరిగింది. కజకిస్తాన్(Kazakhstan)లో విమానం కుప్పకూలింది.
దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్(Christmas) పండుగ వేళ ఘోర ప్రమాదం జరిగింది. కజకిస్తాన్(Kazakhstan)లో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయం(Plane Crash)లో విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా.. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని కజకిస్తాన్ మంత్రి స్పష్టం చేశారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి వెళ్తుండగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.