స్టార్ క్రీకెటర్లపై సీరియస్ యాక్షన్‌కు సిద్దమైన బీసీసీఐ
దిశ, వెబ్ డెస్క్: చివరి క్షణంలో ఐపీఎల్ టీ20 లీగ్ నుంచి స్టార్ ప్లేయర్స్ తప్పుకోవడంపై భారత క్రికెట్ latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: చివరి క్షణంలో ఐపీఎల్ టీ20 లీగ్ నుంచి స్టార్ ప్లేయర్స్ తప్పుకోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. అన్ని ఫ్రాంఛైజీలు ఎన్నో ప్రణాళిక వేసుకొని మంచి ఆటగాళ్లను వేలం వేస్తారు.. అందులోంచి ఒక్క ఆటగాడు వైదొలిగినా ఆ జట్టు లెక్కలు తారుమారవుతాయని గవర్నింగ్ కౌన్సిల్(GC) అభిప్రాయ పడింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్ ఈ సంవత్సరానికి గాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు చివరి క్షణంలో ప్రకటించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న గవర్నింగ్ కౌన్సిల్.. అలాంటి వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. గాయాలతో దూరమైన వారికి ఒక సరైన రీజన్ లేని వారిపై మరోలా.. యాక్షన్ కు జీసీ సిద్దమైంది.
అయితే స్టార్ ప్లేయర్స్ ఇలా వైదొలగడానికి కారణం వారికి వేలంలో తక్కువ రేటు పలకడమే అనే ప్రచారం కూడా సాగుతోంది. రాయ్ విషయానికొస్తే"నేను నా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం సరైనదని నేను భావిస్తున్నాను. అలాగే రాబోయే రెండు నెలల్లో నేను మరియు నా ఆట కోసం సమయాన్ని వెచ్చిస్తాను, ఇది చాలా బిజీ సంవత్సరానికి దారి తీస్తుంది, "రాయ్ చెప్పారు. ఇల అర్ధంతరంగా సీజన్ నుంచి వైదొలిగి విదేశీ ప్లేయర్స్ పై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.