రాత్రి గస్తీకి యువత ముందుకు రావాలి: ఎస్సై శ్వేతా

దిశ, పెగడపల్లి: ఎండ కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో..Awareness seminar in Pegadapally

Update: 2022-03-05 14:45 GMT

దిశ, పెగడపల్లి: ఎండ కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో రాత్రి పూట దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి పూట గస్తీ ఉండడానికి యువత ముందుకు రావాలని కోరారు. మండలంలోని బతికేపల్లి గ్రామంలో గ్రామ యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోకి వ్యాపార అవసరాల నిమిత్తం వేరే ప్రాంతం నుండి వచ్చి ఆర్ధికంగా బలంగా ఉన్న కుటుంబాలను గుర్తించి రెక్కీ నిర్వహించి రాత్రి పూట దొంగతనాలు చేసే అవకాశం ఉంది అని, అందుకోసం తమ సిబ్బందితోపాటుగా గ్రామంలోని యువత కూడా ముందుకు వచ్చి తమకు సహకరించాలని కోరారు. అందుకోసం గ్రామంలోని యువతకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రామంలో ఎక్కడైనా గొడవలు జరిగినా, గంజాయి లాంటివి సరఫరా జరిగినా, ఎవరైనా అనుమానంగా కనిపించినా.. అలాంటి వారి వివరాలను ఎప్పటికప్పుడు గ్రూప్ ద్వారా తమకి సమాచారం అందించాలని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు యువత తమ వంతు బాధ్యతగా తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై శ్వేతతోపాటు పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News