క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది : ఆర్మూర్ ఎమ్మెల్యే

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో,

Update: 2024-12-23 13:31 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో, నందిపేట్ మండల కేంద్రంలో చూడ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్, నందిపేట్ లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిలుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి లు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ తో పాటు, ఆర్మూర్ నియోజకవర్గం లోని అన్ని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సంఘ కాపరుల కుటుంబాలతో కలిసి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పొద్దుటూరు వినయ్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ మండల దైవజనులు ఘనంగా సన్మానించారు. పాస్టర్ జాన్ వెస్లీ ఆనంద్ పాల్ లు క్రిస్మస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రైస్తవుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో క్రైస్తవులకు అండగా తానున్నానని, అన్నివేళలా క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టం జీవన్ , మున్సిపల్ వైస్ చైర్మన్ మునుభాయ్, కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News