Avinash: సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బిగ్ షాక్ ఇచ్చిన అవినాష్‌.. కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

నాగార్జున హౌస్ మేట్స్ ని అడిగి ఎలిమినేట్ చేశాడు.

Update: 2024-10-28 07:07 GMT

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss 8) రసవత్తరంగా సాగుతుంది. గేమ్ రూల్ ప్రకారం ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. గత వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నయని, మెహబూబా ఉండగా.. నయని సేవ్ అయి, మెహబూబా ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఆదివారం ఎపిసోడ్ ఐపోయాక బిగ్ బాస్ తర్వాత ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎవరు ఊహించని విధంగా ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు.

అవినాష్‌ ఎలిమినేట్‌?

ఇక రేపటి ప్రోమోలో అవినాష్‌( avinash)హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో సెల్ఫ్‌ ఎలిమినేట్‌ చేసుకున్నట్లు చూపించారు. మెడికల్‌ రూమ్‌కు హెల్త్ చెక్ అప్ కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. అయితే, అప్పుడు వెళ్లిపోతున్నాను అంటూ అందరికీ బై చెప్పాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ తిరిగివస్తాడా లేక నిజంగానే వెళ్లిపోతాడనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

అసలు ఈ షో లో ఏమి జరుగుతుందో కూడా ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. మొన్నేమో నాగ మణికంఠ నేను ఉండలేకపోతున్నా నన్ను ఇంటి నుంచి పంపించేయండంటూ బిగ్ బాస్ కు ఏడుస్తూ చెప్పాడు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా హౌస్ మేట్స్ ని అడిగి ఎలిమినేట్ చేశాడు. మళ్ళీ, ఇప్పుడు ముక్కు అవినాష్ కూడా హెల్త్ బాగాలేదని సెల్ఫ్ నామినేట్ చేసుకోవడంతో ప్రేక్షకులకు అనేక అనుమానాలు వస్తున్నాయి.

Read More :Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? 

Tags:    

Similar News