హిమచల్‌ప్రదేశ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

Update: 2022-02-22 10:27 GMT

డెహ్రడూన్: హిమచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మంగళవారం ఉనాలోని టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా చనిపోయిన వారిలో చాలా మంది వలస వచ్చిన వారే ఉన్నట్లు ఉనా జిల్లా కమిషనర్ రాఘవ్ శర్మ తెలిపారు.

ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. 'హిమచల్ ప్రదేశ్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పీఎంఎన్ఆర్ ఎఫ్ నుంచి అందిస్తాం. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తాం' అని ట్వీట్ చేశారు. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం తెలిపారు.

Tags:    

Similar News