Ashwini Vaishnaw: అగ్నిపథ్ అల్లర్లు భారత రైల్వేకు తీవ్ర నష్టం కలిగించాయి
Ashwini Vaishnaw Says Indian Railways Suffers huge losses Due to Agnipath Protests| ఇటీవల కాలంలో కేంద్రం అమలు చేసిన అగ్నిపథ్ స్కీంపై దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. ప్రతి రాష్ట్రంలో యువత ఈ స్కీంకు వ్యతిరేకంగా తారాస్థాయి ఆందోళనలు నిర్వహించారు
దిశ, వెబ్‌డెస్క్: Ashwini Vaishnaw Says Indian Railways Suffers huge losses Due to Agnipath Protests| ఇటీవల కాలంలో కేంద్రం అమలు చేసిన అగ్నిపథ్ స్కీంపై దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. ప్రతి రాష్ట్రంలో యువత ఈ స్కీంకు వ్యతిరేకంగా తారాస్థాయి ఆందోళనలు నిర్వహించారు. నిరసనలు చేశారు. ఈ స్కీం తమ జీవితాలను నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు, రైల్వే స్టేషన్లను ధ్వంసం చేశారు. అయితే తాజాగా ఈ అల్లర్ల కారణంగా భారత రైల్వేస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని, దాదాపు రూ.259.44 కొట్ల మేర నష్టం వచ్చిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. అంతేకాకుండా ఈ అల్లర్లలో చేసిన విధ్వంసం కారణంగా మరెన్నో రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయని, వాటన్నింటిని పునరుద్ధరించేందుకు కాస్త సమయం పడుతుందని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ఆ 300 పందుల్ని చంపాల్సిందే..?!