దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో 5.3 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో 5.3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..telugu latest news
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో 5.3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ఎంపీ డాక్టర్ టీఆర్ పారివెందర్ పోలీసు ఖాళీలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేంద్రం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఉండాల్సిన పోలీసులు 26,23,225 అని అన్నారు. అయితే ప్రస్తుతం 20,91,488 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. 2020 జనవరి 1 కల్లా 5,31,737 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు ఉద్యోగ భర్తీ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకే పోలీసు ఉద్యోగాల భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఒక్క నాగాలాండ్ లోనే అదనపు బలగాలు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా యూపీలో లక్షకు పైగా ఖాళీలు, బెంగాల్‌లో 55 వేల ఖాళీలు, బీహార్ లో 47 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పారు.