ఆరోగ్యశ్రీ బకాయిలు @700 కోట్లు.. పేషెంట్‌లకు తప్పని తిప్పలు..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.700 కోట్లు ఉన్నాయి.-latest Telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.700 కోట్లు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ వరకు ప్రైవేట్ఆస్పత్రుల్లో 88,958 మందికి, గవర్నమెంట్‌లో 57,676 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్అందించారు. ఈ రెండు సెక్టార్లూ కలిపి రూ.349 కోట్లా 11 లక్షలా 86,333 బకాయిలున్నాయి. గడిచిన ఆరు నెలల పెండింగ్బిల్లులు కలిపితే దాదాపు రూ.700 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రైవేట్ఆస్పత్రులు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పాత బిల్లులే సకాలంలో అందని క్రమంలో కొత్త పేషెంట్లను చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రూ.500 కోట్ల చొప్పున ఎనిమిదేళ్లలో రూ.4138 కోట్లా 78 లక్షలు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసినట్లు పేర్కొన్నది.