సర్వీస్‌లో గాయపడితేనే ఆర్మీ వైకల్య పెన్షన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: ఆర్మీ సిబ్బందికి వైకల్య పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిలిటరీ సర్వీసులో ఉన్న సమయంలో గాయపడితేనే వైకల్య పెన్షన్ ఇవ్వాలని అది కూడా వైకల్య శాతం 20శాతం దాటి ఉండాలని పేర్కొంది..Latest Telugu News
న్యూఢిల్లీ: ఆర్మీ సిబ్బందికి వైకల్య పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిలిటరీ సర్వీసులో ఉన్న సమయంలో గాయపడితేనే వైకల్య పెన్షన్ ఇవ్వాలని అది కూడా వైకల్య శాతం 20శాతం దాటి ఉండాలని పేర్కొంది. ఆర్మీ సిబ్బందికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 'వైకల్యం సైనిక సేవలో కొనసాగుతున్న లేదా తీవ్రతరమైనా, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే తప్ప, వైకల్యం పెన్షన్‌కు అర్హత ఏర్పడదు' అని బెంచ్ పేర్కొంది. వైకల్యానికి కారణమయ్యే గాయాలకు, సైనిక సేవకు మధ్య సహేతుకమైన సంబంధం ఉండాలని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ సమర్పణతో సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రస్తుత కేసులో ఆర్మీ సెలవు దినంలో యాక్సిడెంట్ గాయపడ్డాడని కోర్టు తెలిపింది.
'సైనిక సేవకు గానీ ప్రతివాదికి గాయాలు మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఈ అంశం మూలాల్లోకి వెళ్లి ధర్మాసనం పరిశీలించింది. అందువల్ల, ప్రతివాది వికలాంగ పింఛనుకు అర్హులు కాదు' అని పేర్కొంది. ఈ కేసులోని సిబ్బంది జూన్ 4, 1965న సైన్యంలో చేరగా, 10 సంవత్సరాల 88 రోజుల పాటు సర్వీస్ అందించారు. ఆ తర్వాత 1976లో ఆయన డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ లో చేరగా, 1999లో వార్షిక సెలవులు పొందారు. ఈ క్రమంలో ఆయన గాయపడగా, వైకల్యం శాతాన్ని 80 శాతంగా అంచనా వేసి తక్కువ మెడికల్ కేటగిరీలో ఉంచింది. దీంతో సెప్టెంబర్ 2000 నుంచి ఆయనకు సర్వీస్ కు పనికిరాడని నిర్ధారించగా, ఆయన వైకల్య పెన్షన్ మంజూరు చేయాలని అర్మ్ డ్ ఫోర్సెస్ ట్రిబ్యునెల్‌ను కోరారు. సెలవు సమయంలో సిబ్బంది గాయపడి, సైనిక సేవకు అర్హత లేని పరిస్థితుల్లో వైకల్యం సైనిక సేవకు ఆపాదించబడుతుందని ట్రిబ్యునల్ పేర్కొంది.