Kids Food: పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెడుతున్నారా.. దీనిపై ఎఫెక్ట్ చూపుతుంది
పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకు తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాపాడుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకు తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. బెడ్‌పై నుంచి ఎక్కడ కిందపడిపోతుంటారు.. ఏ వస్తువులు నోట్లో పెట్టుకుంటారని అనుక్షణం ఫోకస్ మొత్తం పిల్లలపైనే ఉంచుతారు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే.. హెల్తీగా ఉంటారని డాక్టర్ల సలహాలు తీసుకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎలాంటి పుడ్ ఇష్టపడుతున్నారో తెలిసిందే. ఎక్కువగా జంక్ ఫుడ్(junk food) తినేందుకే మొగ్గు చూపుతున్నారు. బర్గర్లు(Burgers), పిజ్జా(Pizza), నూడుల్స్(Noodles) వంటికి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్(breakfast)లో పెట్టే పేరెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఆహారాలు వల్ల పిల్లలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల(Chronic health problems) బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
మధుమేహం(diabetes), హార్ట్ ప్రాబ్లమ్స్(Heart problems), క్యాన్సర్(Cancer) వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోషకాహార లోపం(Malnutrition) వల్ల పలు చోట్ల పలువురు మరణించారంటూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. జంక్ ఫుడ్ లో సోడియం(Sodium) పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు(blood pressure) ప్రాబ్లమ్ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొన్నిసార్లు దృష్టి నష్టం లేదా అంధత్వానికి దారితీస్తుంది. అలాగే ఈ జంక్ ఫుడ్ తింటే పిల్లల్లో ఊబకాయం ముప్పు కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో పిల్లల కంటి చూపు(eye sight)పై ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా ఇమ్యూనిటీ(Immunity)ని పెంచే ఆహారాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
Read More...
Foods : వింటర్‌లో డల్‌నెస్ పెరిగిందా..? మీలో ఉత్సాహం నింపే ఫుడ్స్ ఇవే..