వీల్స్ Vs డోర్స్.. దుమారం లేపిన ట్విట్టర్ యూజర్
దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్ అనేది ఎంత సమాచారాన్ని అందిస్తుందో అంతే స్టుపిడ్ కంటెంట్‌తో యూజర్స్‌ను.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్ అనేది ఎంత సమాచారాన్ని అందిస్తుందో అంతే స్టుపిడ్ కంటెంట్‌తో యూజర్స్‌ను ఎగ్జైట్ చేస్తూ హ్యాపీగా ఉంచుతుంది. డిబేట్స్ మొదలుపెట్టి బోర్ కొట్టకుండా కూడా చేయగల నెట్టింట్లో తాజాగా 'వీల్స్ వర్సెస్ డోర్స్' టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. ట్విట్టర్ యూజర్ రియాన్ నిక్సోన్ 'ప్రపంచంలో వీల్స్ ఎక్కువ ఉన్నాయా లేకా డోర్స్?' అనే ప్రశ్నను పోస్ట్ చేశాడు. 'నేను, నా మేట్స్ ఈ డిబేట్ స్టార్ట్ చేశాం.. మీ ఉద్దేశమేంటో చెప్పండి' అని చర్చ ప్రారంభానికి నాంది పలికాడు. మార్చి 5న స్టార్ట్ అయిన ఈ చర్చ ఇప్పుడు టిక్ టాక్, రెడిట్, ఇన్‌స్టాగ్రామ్‌కు కూడా విస్తరించింది.
ఇక రియాన్ తన పోస్ట్‌కు పోలింగ్ ఫీచర్ కూడా యాడ్ చేయగా.. ఇప్పటి వరకు వేలలో రిప్లయ్‌లు, 223,347 ఓట్లు, 18వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఫైనల్‌గా కేవలం 7 శాతం అధిక ఓటింగ్ సాధించిన వీల్స్ (53.6శాతం ఓటింగ్), డోర్స్(46.4 శాతం ఓటింగ్) కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయని తేల్చేశారు. కామెంట్ సెక్షన్‌లో టీమ్ డోర్స్, టీమ్ వీల్స్‌గా విడిపోయి చర్చకు దిగిన యూజర్స్.. ఇందుకోసం ఇచ్చిన రీజన్స్ ఆకట్టుకుంటున్నాయి. రెండు తలుపులు ఉన్న ఇంట్లో మూడు సూట్‌కేసులు ఉంటే వాటికి 6-12 వీల్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలని ఒకరంటే.. బైక్స్ మినహా వీల్స్ కలిగిన అన్ని వెహికిల్స్‌కు డోర్స్ ఉంటాయని.. రెండు కార్లు, ఒక బైక్ కలిగిన తన వాహనాలను చూసుకున్నట్లయితే 10 వీల్స్, 28 డోర్స్ ఉన్నాయని వివరించారు మరొకరు.