Aloevera gel: కలబంద జెల్‌ను ఇలా వాడుతున్నారా.. ఎదుర్కొనే దుష్ప్రభావాలివే?

ముఖ్యంగా కలబంద ఆడవాళ్లు ఫేస్‌కు ఎక్కువగా అప్లై చేస్తుంటారు.

Update: 2025-01-08 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యంగా కలబంద (aloe vera)ఆడవాళ్లు ఫేస్‌కు ఎక్కువగా అప్లై చేస్తుంటారు. ముఖంపై పింపుల్స్(Pimples) అండ్ సాఫ్ట్‌నెస్ కోసం వాడుతుంటారు. ఫేస్‌పై రాస్తే గ్లో(Glow)తో పాటుగా తాజాదనం కూడా పెరుగుతుంది. నోటి దురద(Itchy mouth), దద్దుర్లు(hives) వచ్చినా.. నోటి సబ్‌ముకస్ ఫైబ్రోసిస్(Submucous fibrosis), బర్నింగ్ మౌత్ సిండ్రోమ్(Burning mouth syndrome), కాలిన గాయాలకు కలబంద మేలు చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న కలబందను డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేస్తే నష్టాలు జరిగే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

అయితే కలబంద డైరెక్ట్‌గా ముఖానికి పెడ్తే.. కొంతమందికి అలర్జీ సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఫేస్ పై ఎరుపు, దురద లేదా వాపు వంటివి కనిపిస్తాయి. వీటితో పాటుగా స్కిన్ పై చికాకు, వడదెబ్బకు గురయ్యే చాన్స్ పెరుగుతుందట. అలాగే తరచూ అలోవెరా పెట్టడం ద్వారా స్కిన్ పై తేమపోతుంది. మండుతోన్న అనుభూతి కలుగుతుంది. కాగా కలబందను రోజ్ వాటర్(Rose water) తో మిక్స్ చేసి వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే శనిగపిండి, టమాట రసం(Tomato juice) కలిపి కూడా పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. మొక్క నుంచి తీసిన అలోవెరా జెల్ ఫేస్‌కు అప్లై చేయడం వల్ల మార్కెట్ లో దొరికే కలబంద జెల్ ఉపయోగించడం మేలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News