CM Jagan: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. అపాచీలో 80 శాతం ఉద్యోగాలు వారికే

CM Jagan Lays The Foundation Stone For Apache Company| ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో నిర్మించబోతున్న అపాచీ పరిశ్రమ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతిలోని పేరూరు బండపై

Update: 2022-06-23 11:12 GMT

దిశ, ఏపీ బ్యూరో : CM Jagan Lays The Foundation Stone For Apache Company| ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో నిర్మించబోతున్న అపాచీ పరిశ్రమ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతిలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీవకుళమాత ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నాం 12.05 గంటలకు సీఎం జగన్ ఇనగలూరు చేరుకున్నారు. హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

అపాచీ పరిశ్రమలో ఆడిడాస్‌ షూలు, లెదర్‌ జాకెట్స్‌, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో నేరుగా 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 5వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2023 సెప్టెంబర్‌ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుందన్న సీఎం వైఎస్ జగన్ ఈ కంపెనీలో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ అక్కడ నుంచి ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమను ప్రారంభించారు.

Tags:    

Similar News