Venkatesh: కొండా సురేఖ కామెంట్స్‌పై వెంకటేష్ రియాక్షన్.. రాజకీయ లబ్ధి కోసం ఇలా చేయడమేంటని సెన్సేషనల్ ట్వీట్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-03 06:16 GMT

దిశ, సినిమా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటు రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అయితే ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అయి సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, దగ్గుబాటి వెంకటేష్ ‘X’ వేదికగా స్పందించారు. ‘‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.

వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్ వర్క్ అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ ఇందులో భాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సానుభూతి పాటించాలని కోరుతున్నా, మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.

 

Tags:    

Similar News