‘ప్రజాస్వామ్యం’ వన్ వే ట్రాఫిక్ కాదు.. కొండా సురేఖపై బీజేపీ నేత, నటి కుష్బూ ఫైర్

సినీనటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Update: 2024-10-03 06:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సినీనటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం కొండా సురేఖపై సినిమా ఇండ్రస్ట్రీ ప్రముఖులు ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌, న‌టి కుష్బూ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండు నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి భాష మాట్లాడతార‌ని తాను అనుకున్నట్లు తెలిపారు. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నానని తెలిపారు. కొండా సురేఖ గారు.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదన్నారు.

ఇలాంటి ఆధారం లేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదని, ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీరు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేమని విమర్శలు చేశారు. కాగా, హీరో నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆరే అని మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయకూడదంటే సమంతను తన దగ్గరికి పంపాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Similar News