మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ ఫైర్.. హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ ట్వీట్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో ఏకతాటిపైకి వచ్చిన టాలీవుడ్.. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Update: 2024-10-03 06:11 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో ఏకతాటిపైకి వచ్చిన టాలీవుడ్.. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హీరో నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, సుధీర్ బాబు, అఖిల్, మంచు విష్ణు, సుశాంత్ లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాజాగా సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన హీరో వెంకటేష్ స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం." అని అన్నారు. అలాగే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. తన ట్వీట్ లో "మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన పరుషమైన, అనవసరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను." కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు. మాపై ఇలాంటి ప్రవర్తనను మేము సహించం. రాజకీయ ప్రేరేపణలకు సినీ ప్రముఖులను, వారి కుటుంబాలను సాఫ్ట్ టార్గెట్‌గా వాడుకోవడం మానేయాలి." అని రాసుకొచ్చారు. కాగా ఈ సమంతపై తాను చేసిన వ్యాఖ్యలపై రోజు ఉదయం మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. సమంతపై తాను చేసిన వ్యాఖ్యలకు బాదపడ్డానని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.


Similar News