కొండా సురేఖ vs సమంత.. స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్.. ఏమందంటే..
కొండా సురేఖ - సమంత విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. సమంతకు ఆమె క్షమాపణలు చెప్పకపోయి ఉంటే.. పరిణామాలు తీవ్రంగా ఉండేవని పేర్కొంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అక్కినేని ఫ్యామిలీలో విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సమంత, నాగచైతన్య, నాగార్జున, మాజీమంత్రి కేటీఆర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ఎక్స్ వేదికగా ప్రకటించినా.. ఆమె చేసింది ముమ్మాటికీ తప్పేనని సినీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా.. ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Mahila Commission)స్పందించింది.
సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించామని, సమంతకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పకపోయి ఉంటే.. మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించేదన్నారు. ఈ వ్యవహారంలో ఇక తమ పాత్ర అవసరం లేదని భావిస్తున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ పేర్కొంది. ఈ విషయంలో నాగార్జున (Nagarjuna) మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా అతని వ్యక్తిగతమని కమిషన్ అభిప్రాయపడింది.