Unstoppable 4: బాలకృష్ణ టాక్ షోలో మరోసారి ఏపీ సీఎం.. వైరల్ అవుతోన్న ఫొటోలు

అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ షూటింగ్ కు ఏపీ సీఎం హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2024-10-20 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ షో (Unstoppable Show) కి భారీ ప్రేక్షకాదరణ దక్కింది. దాంతో మేకర్స్ సీజన్ 2, సీజన్ 3 లను కూడా షూట్ చేసి.. ఎపిసోడ్లను స్ట్రీమింగ్ చేశారు. ప్రతీ సీజన్లోనూ అగ్రనాయకులు, సెలబ్రిటీలను తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు బాలకృష్ణ. ఆయన అడిగే ప్రశ్నలు, ఇచ్చే టాస్కులు, వేసే జోకులు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి. గత సీజన్ కి ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు.. అన్ స్టాపబుల్ 4(Unstoppable 4) కి ఏపీ సీఎం హోదాలో హాజరయ్యారు.

గత సీజన్ తొలి ఎపిసోడ్ చంద్రబాబుతోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తోనే తొలి ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ ను షూట్ చేయగా.. అక్కడికి వచ్చిన చంద్రబాబుకు బాలకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వారల్ అవుతున్నాయి. కాగా.. ఈసారి బాలకృష్ణ చంద్రబాబు నాయుడిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఏపీ సీఎం హోదాలో షో కి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి ఏం మాట్లాడనున్నారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దీపావళి కానుకగా.. అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు ఈ ఎపిసోడ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్లోనూ అగ్రహీరోలు, డైరెక్టర్లు, పొలిటీషియన్లతో ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రేక్షకులకు ఎవ్రీ వీక్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. 


Similar News