సన్యాసిలా జీవించలేను.. పెళ్లి కావాలంటున్న నటి
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి అనఘా భోస్లే తన మ్యారేజ్ విషయంలో ఓపెన్ అయింది.
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి అనఘా భోస్లే తన మ్యారేజ్ విషయంలో ఓపెన్ అయింది. 22 ఏళ్ల ఈ బ్యూటీ తనకు కాబోయే జీవిత భాగస్వామి తనలాగే ఆధ్యాత్మిక, మతపరమైన భావజాలం కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. అయితే అలాంటి కోరికలు కలిగి ఉండటాన్ని ప్రత్యేక హక్కుగా భావిస్తున్నానన్న నటి.. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందనే బలమైన నమ్మకంతో ఉన్నట్లుగా చెప్పింది. అంతేకాదు పెళ్లి తర్వాత మహారాష్ట్ర వాడాలో అందమైన పర్యావరణం కలిగిన విలేజ్కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు కొత్త జీవనశైలికి అలవాటుపడే క్రమంలో తన బాధ్యతలు మరచిపోనని.. అభిమానులు, శ్రేయోభిలాషులను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉంటానని మాటిచ్చింది. ఇక ఇంతకాలం ఎకోవిలేజ్లో సన్యాసిగా జీవించడంలో ఆత్మ సంతృప్తి పొందినట్లు తెలిపిన నటి.. పేరెంట్స్ జీవితకాలం సన్యాసిలా బతకాలనే కోరుకున్నట్లు తెలిపింది.