మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే : అనసూయ
దిశ, సినిమా : ప్రముఖ తెలుగు నటి అనసూయ భరద్వాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని latest telugu news..
దిశ, సినిమా : ప్రముఖ తెలుగు నటి అనసూయ భరద్వాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసింది. సమాజంలో ఉన్న కొంతమంది పురుషులకు ఈ ప్రత్యేక రోజునే మహిళలపై ఎక్కడలేని గౌరవం పుట్టుకొస్తుందంటూ కౌంటర్ వేసింది. అంతేకాదు ఈ ఒక్క రోజుకు పరిమితమయ్యే గౌరవాన్ని స్వీకరిస్తే అతివలంతా అవివేకులు అవుతారని సెలవిచ్చింది. ట్వీట్ విషయానికొస్తే.. 'ఓ.. ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ ఈ రోజు హఠాత్తుగా, అకస్మాత్తుగా మహిళలను గౌరవించాలని గ్రహించారు. కానీ ఈ రెస్పెక్ట్ 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి స్త్రీలందరికీ హ్యాపీ ఫూల్స్ డే' అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022