ప్రైమ‌రీ టీచ‌ర్ ప్రేమించే ట్రిక్.. కిడ్స్ ఇష్ట‌మైన చోట‌ ట‌చ్ చేయొచ్చు! (వీడియో)

ఈ ప్రేమ పూర్వ‌క ప‌ల‌క‌రింపును మీరూ చూడండి! An adorable video of a teacher greeting her students.

Update: 2022-06-21 12:40 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః పిల్లలు పొర‌పాటు చేస్తే, చిత్ర‌హింస‌పెట్టే కొంద‌రు టీచ‌ర్లు సంగ‌తి ప‌క్క‌న‌పెడితే, విద్యార్థుల్ని త‌మ బిడ్డ‌ల్లా ప్రేమించే టీచ‌ర్ దొర‌క‌డం చాలా అదృష్టం. భార‌త‌దేశం సంగ‌తి అటుంచితే, కొన్ని దేశాల్లో ప్రైమ‌రీ పాఠ‌శాల‌ల్లో విద్యార్థులను ఆక‌ర్షించ‌డానికి టీచ‌ర్లు వైవిధ్య‌మైన ట్రిక్స్ పాటిస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఇంట‌ర్నెట్‌లో అప్ప‌డప్పుడూ ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. అలాంటి ఓ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అయ్యింది. త‌ర‌గ‌తి గ‌ది ద్వారం ద‌గ్గ‌ర ఒక టీచర్ తన విద్యార్థులను విష్ చేస్తూ, ప‌లకరించే విధానం ఎంతో హృద్యంగా అనిపిస్తుంది. మరింత ప్ర‌శంసించ‌ద‌గ‌ని విష‌యం ఏంటంటే, ప్ర‌తి విద్యార్థీ త‌మ‌కు ఇష్ట‌మైన రీతిలో త‌మ‌ టీచ‌ర్‌ను ప‌ల‌క‌రించ‌వ‌చ్చు. ద్వారం ప‌క్క‌నే అంటించి ఉన్న పోస్ట‌ర్‌లోని సింబ‌ల్‌లో ఒక‌దాన్ని విద్యార్ధులు ట‌చ్ చేసి, దాని బట్టి టీచ‌ర్‌ని విష్ చేయొచ్చు. వైరల్‌గా మారిన ఈ వీడియోను ఆల్విన్ ఫూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌గా, నటుడు జేమ్స్ వుడ్ కూడా రీట్వీట్ చేశారు. టీచ‌ర్‌కు విద్యార్థుల‌కు మ‌ధ్య ఉన్న ఈ ప్రేమ పూర్వ‌క ప‌ల‌క‌రింపును మీరూ చూడండి!


Similar News