ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్: అమిత్ షా

అగర్తలా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ మహిళా..telugu latest news

Update: 2022-03-08 14:40 GMT

 అగర్తలా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున త్రిపుర మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా అగర్తలాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాష్ట్రంలో రాజకీయ హింసను అంతం చేశారని అన్నారు. 'రాష్ట్రంలోని యువత కోసం రూ.200 కోట్లతో మేము జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. గత నాలుగేళ్లలో ప్రతి వ్యక్తి ఆదాయం 13 శాతం పెరిగింది' అని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. త్రిపురలో ప్రతిష్టాత్మకమైన ఉద్యానవన రంగం నుండి ప్రయోజనం పొందేందుకు అపారమైన అవకాశాలను కలిగి ఉందని తెలిపారు. రాష్ట్రం నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలనే కల ఇప్పుడు నిజమైందని చెప్పారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వాన్నే గెలిపించాలని కోరారు.



Tags:    

Similar News