'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ యూనిట్‌ను కలిసిన అమిత్ షా..
దిశ, సినిమా: 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ యూనిట్‌ను అభినందించారు యూనియన్.telugu latest news
దిశ, సినిమా: 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ యూనిట్‌ను అభినందించారు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్‌ను ఢిల్లీలోని తన నివాసంలో కలిసిన ఆయన.. ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్‌పై అభినందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన దర్శకుడు.. శాంతియుత, సుసంపన్నమైన కశ్మీర్ కోసం అమిత్ షా చేసిన ప్రయత్నం అక్కడ సోదరభావాన్ని బలోపేతం చేసిందన్నారు. కాశ్మీరీ ప్రజలు, భద్రతా దళాల హక్కుల కోసం చేసిన స్థిరమైన ప్రయత్నాలు అభినందనీయమని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన తీసుకున్న బోల్డ్ డెసిషన్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా 2019 ఆగస్టు 5న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి..ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.