Allu Arjun: ఆ స్టార్ హీరోయిన్‌తో చెన్నైకి చెక్కేసిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా? (పోస్ట్)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule).

Update: 2024-11-24 10:05 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని(Naveen Erneni), రవిశంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్ చేయనుంది. అయితే ఇటీవల పుష్ప-2 ట్రైలర్ విడుదల భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ అందరిలో హైప్ పెంచుతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. నేడు ‘కిస్సిక్’(Kissik) అనే స్పెషల్ సాంగ్ విడుదల కాబోతుంది. ఇందుకోసం మేకర్స్ చెన్నై(Chennai)లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం రష్మిక, అల్లు అర్జున్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. వైట్ కలర్ టీ షర్ట్(T-shirt) ధరించిన వీరిద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మైత్రీ మూవీ మేకర్స్ ‘X’ ద్వారా షేర్ చేశారు. ఇందులో ఐకాన్ స్టార్ స్టైలీష్ లుక్‌ మెస్మరైజింగ్ స్మైల్‌తో కనిపించి అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టేస్తున్నారు.

👉 Click Here For Tweet 




Tags:    

Similar News