ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటాం
ర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు వ్యక్తిగతంగా కానీ,సామాజిక పరంగా వచ్చే సమస్యల పరిష్కారానికి తాము అండగా నిలుస్తామని జిల్లా అదనపు ఎస్పీ రాములు భరోసా ఇచ్చారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు వ్యక్తిగతంగా కానీ,సామాజిక పరంగా వచ్చే సమస్యల పరిష్కారానికి తాము అండగా నిలుస్తామని జిల్లా అదనపు ఎస్పీ రాములు భరోసా ఇచ్చారు. గురువారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన..ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రిటైర్మెంట్ అయ్యాక తమ డబ్బును కాని,ఆస్తిని కాని తమ పేరునే ఉంచుకోవాలని సూచించారు. తల్లితండ్రుల పోషణ భారాన్ని పిల్లలు విధిగా తీసుకోవాలని,నిర్లక్ష్యం వహిస్తే,2007 లో కేంద్రం తెచ్చిన వృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులని ఆయన తెలిపారు. ప్రస్తుత సమాజంలో డిజిటల్ మోసాలు పెరిగిపోయాయని,అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ఫోన్ లో వచ్చే అనవసరపు 'లింకు' లను తాకవద్దని ఆయన సూచించారు.ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్థానిక పోలీసులు సహాయం కోసం 100 కు,సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 కు డయల్ చేయాలని ఆయన సూచించారు. ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్.నారాయణ,భగవంతు,శ్రీనివాస్ రెడ్డి,కేఆర్ రెడ్డి,జెఎన్ రెడ్డి,లలితమ్మ,భీమమ్మ,సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు జగపతిరావు,నాగభూషణం,జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మెన్ బునేడ్ బాల్ రాజ్,తదితర విశ్రాంత ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.