మీ రక్షణ కోసమే షీ టీంలు
జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న షీ టీంలు,భరోసా సెంటర్లు మీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినవే అని డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న షీ టీంలు,భరోసా సెంటర్లు మీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినవే అని డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక క్రిస్టియన్ పల్లి లోని పంచవటి హై స్కూల్ లోని బాల బాలికలకు షీ టీం,భరోసా సెంటర్ లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. షీ టీం అంటే ఏమిటి,అది ఎలా పని చేస్తుందో చెపుతూ,ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా వేధింపులు,మహిళల అక్రమ రవాణా,బాలల దుర్వినియోగం,బాల్య వివాహాలు,బాల కార్మికులు,బోండెడ్ లేబర్,ఫోక్స్ చట్టం,చైల్డ్ లైన్ నెంబర్ 1098,పని వేధింపులు,మంచి,చెడు టచ్చెస్,యాంటీ ర్యాగింగ్,సెల్ఫ్ డిఫెన్స్,సైబర్ క్రైమ్ లాంటి అనేక సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్ సిద్ధంగా ఉంటుంది తెలిపారు. షీ టీం సహాయానికి 8712659365 లేదా క్యూఆర్ కోడ్ ద్వారా షీ టీం కు,రోడ్డు భద్రతకు చేరుకోవడానికి కొత్త మార్గం అని ఆయన వివరించారు. భరోసా సెంటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవా కేంద్రమని,ఇది మహిళలు,పిల్లలు,కుటుంబ సభ్యులకు వేధింపులు,హింస బాధితుల కోసం మద్దతు,న్యాయం పొందడానికి ఫిర్యాదు చేస్తే..సహాయపడుతుందన్నారు. డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు,చికిత్స అందిస్తుందని,బాధితులు భరోసా సెంటర్ ఫోన్ నెంబర్ 8712659280 కు కాల్ చేయవచ్చని డిఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీ నాయక్,ఉమెన్స్ ఎస్ఐ సుజాత,వనజ రెడ్డి,రఘు,హెచ్ఎం,విద్యార్థులు పాల్గొన్నారు.