ఆ అనారోగ్య సమస్యతో చాలా బాధ పడ్డా .. దాని వలనే షూటింగ్ మధ్యలో ఆపేశారు : Allu Arjun

ఈ ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2 గా మన ముందుకొచ్చింది.

Update: 2024-11-24 05:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన తర్వాత నుంచి ఆ షో రేంజే మారిపోయింది. ఈ ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2 గా మన ముందుకొచ్చింది. రిలీజ్ అయి ట్రెండ్ అవుతుంది కూడా .. పార్ట్ 2 లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ హైలెట్. ఇక త్వరలో, రిలీజ్ అవ్వబోయే పుష్ప 2 ( pushpa 2 ) గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

అయితే, పుష్ప 2లో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసిన విషయం మనకు తెలిసిందే. ఆ పోస్టర్స్, గ్లింప్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. వాటిని చూస్తుంటేనే బన్నీ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. తాజాగా, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. " నేను ఆ లేడీ గెటప్ వేసుకున్నప్పుడు ఫస్ట్ మీ నాన్న గారినే(ఎన్టీఆర్) తలుచుకున్నాను. వామ్మో ఆయన ఎలా చేసారో అనిపించేది. చాలా చాలా కష్టపడ్డాను ఆ ఒక్క గెటప్ కోసం. ఆ చీర, మేకప్, పైన నగలు అన్ని వేసుకొని కొన్ని గంటలు ఉండేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. దాని వలన కొన్ని నెలలు బాధ పడ్డాను. ఆ పెయిన్ ఎక్కువయ్యి నా వల్ల కాక షూటింగ్ మధ్యలోనే ఆపేసారు మధ్యలో అని తెలిపాడు. ఇక ఆ లేడీ గెటప్ సీన్స్ సినిమాలో ఏ రేంజ్ లో పేలతాయో" చూడాల్సి ఉంది.

Tags:    

Similar News