Ranbir - Alia: రణ్‌బీర్-ఆలియా పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న కరణ్ జోహార్..
దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సాక్షిగా ఒక్కటయ్యారు.
దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సాక్షిగా ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. గురువారం రణ్‌బీర్ ఇంట్లో కన్నుల పండుగగా జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భావోద్వేగానికి గురయ్యారు. కెరీర్ ప్రారంభం నుంచి ఆలియాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న కరణ్.. పెళ్లి పందిరిలో తనను చూసి ఆనందంతో కంటతడి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పెళ్లి తర్వాత నూతన వధూవరులను ఆప్యాయంగా కౌగిలించుకుని ఆశీస్సులు అందించిన కరణ్.. గతంలోనూ చాలాసార్లు ఆలియా పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆయనే కావడం విశేషం. ఇక ఈ ఎమోషనల్ మూమెంట్‌పై కామెంట్ చేస్తున్న నెటిజన్లు.. ఆలియా పట్ల తను అమితమైన ప్రేమ కలిగిఉన్నాడని మరోసారి రుజువైందంటున్నారు ఫ్యాన్స్.