Chinni Krishna: సినీ రచయిత చిన్నికృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ(chinni Krishna) ఇంట్లో విషాదం నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ(chinni Krishna) ఇంట్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారు జామున చిన్ని కృష్ణ తల్లి లక్ష్మి సుశీల(Lakshmi Sushila) మరణించారు. ఈమె గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (డిసెంబరు 25) సుశీల తుదిశ్వాస విడువడంతో రచయిత కృష్ణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మి సుశీల అంత్యక్రియలు నేడు స్వగ్రామం తెనాలి(Tenali)లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తల్లితో కృష్ణ అనుబంధం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈవిడపై ఎన్నో కవితలు కూడా రాసి తల్లిపై ప్రేమను చాటారు. ప్రతి జన్మలో కూడా నేను నీకు పుట్టాలి అమ్మా.. అంటూ మదర్స్ డే రోజున లక్ష్మి సుశీల గురించి ఓ ఎమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.