మళ్లీ రౌడీ హీరో సరసన ఆ స్టార్ హీరోయిన్..? ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న నెటిజన్లు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-25 04:51 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేయగా.. ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పూర్తికాకముందే రౌడీ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ చిత్రం కోసం విజయ్ ఏకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీన్ని విన్న నెటిజన్లు.. ఈ హిట్ పెయిర్ మళ్లీ జతకడితే ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News