ఆ సర్జరీ చేసుకునే ధైర్యం నాకు లేదు.. స్టార్ కిడ్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ అలయ ఎఫ్ కాస్మెటిక్ సర్జరీలపై తన ఒపీనియన్ చెప్పింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన బ్యూటీ..Latest Telugu News
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ అలయ ఎఫ్ కాస్మెటిక్ సర్జరీలపై తన ఒపీనియన్ చెప్పింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన బ్యూటీ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి అలరించింది. ఈ క్రమంలోనే ఓ ఫాలోవర్ 'మీరు ఈ మధ్య చాలా అందంగా కనిపిస్తున్నారు. కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారా?' అని అడిగాడు. దీనికి తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చిన అలయ.. 'అలా చేసే ధైర్యం నాకు లేదు. ఎప్పటికీ ఆ పని చేయలేను.
అలాంటి ప్రయోగాలు చేయకపోతేనే భవిష్యత్తులో నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటానని అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి వాటిపై ఫోకస్ చేస్తానని అనుకోవట్లేదు' అంటూ కూల్‌గా వివరించింది. ఇక 2020లో 'జవానీ జానేమాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి.. ఇదే చిత్రానికిగానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
#AlayaF was recently asked about getting cosmetic surgery, and here's what she had to say. #Watch! 👇#Bollywood pic.twitter.com/lo5K1sHPtw
— HT City (@htcity) July 6, 2022