Naga Chaitanya: నాగచైతన్యకు షాకిచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అలా హామీ ఇచ్చిన చైతూ

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.

Update: 2022-04-12 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.  జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద చైతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనకు పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె ముత్తు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ చైతన్య తన టయోటా వెల్‌ఫైర్ (TS09FT 2003)లో ప్రయాణిస్తుండగా, గ్లాస్‌పై బ్లాక్ ఫిల్మ్ కలుషితం కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. అందులో నాగచైతన్య ఉన్నారు. దీంతో చైతూ వెంటనే ట్రాఫిక్ పోలీసులకు రూ.715 జరిమానా చెల్లించాడు. అనంతరం బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..