Aish- Abhishek: ఐష్- అభిషేక్ విడాకులు.. ఆ ఒక్క మాటతో డివోర్స్ రూమర్స్‌కు చెక్ పెట్టేశాడుగా..
బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ తల్లులుగా ఐశ్వర్య, జయ బచ్చన్ల బాధ్యతల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేది ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకొని ఎప్పుడో రాత్రిపూట వస్తుంటాడు. అలాగే నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్య తోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడో వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్లలో ఒకరిగా చూస్తారు” అంటూ అభిషేక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఒక్క మాటతో డివోర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.