ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బొరిగాం గ్రామ శివారులో శుక్రవారం రూరల్ పోలీసులు దాడి నిర్వహించారు.

Update: 2024-12-27 14:37 GMT

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బొరిగాం గ్రామ శివారులో శుక్రవారం రూరల్ పోలీసులు దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో ఎస్సై సందీప్ సిబ్బందితో కలిసి బొరిగాం గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుండి రూ.5.500 నగదు తో పాటు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి నమోదు చేసినట్లు తెలిపారు. 


Similar News