వాయు కాలుష్యంతో ఆటోఇమ్యూన్ వ్యాధులు!

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం మూలాన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10 లక్షలకు పైగా జనాలు latest telugu news..

Update: 2022-03-29 07:27 GMT

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం మూలాన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10 లక్షలకు పైగా జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారత్‌లో మానవ ఆరోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్న అంశాల్లో వాయు కాలుష్యం రెండో స్థానంలో ఉందని వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్టు ఇటీవలే వెల్లడించింది. ఇప్పటికే 'స్ట్రోక్, బ్రెయిన్ క్యాన్సర్, గర్భస్రావం, మానసిక ఆరోగ్య సమస్యల' కి కారణమవుతున్న ఎయిర్ పొల్యూషన్.. దీర్ఘకాలికంగా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని తాజా పరిశోధనలో తేలింది. దీనివల్ల భారతీయుల ఆయుర్దాయం తొమ్మిదేళ్లు తగ్గొచ్చని గతంలో ఒక అమెరికన్ స్టడీ కూడా పేర్కొంది.

శరీరంలో దాదాపు ప్రతి కణం ఈ చెడు గాలి వల్ల ప్రభావితమవుతుందని 2019లో ప్రచురితమైన గ్లోబల్ రివ్యూ వెల్లడించింది. అంతేకాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం సుమారు 40% పెరుగుతుందని, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధికి 20% ఎక్కువ ప్రమాదముందని వెరోనా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు 2016(జూన్) నుంచి 2020(నవంబర్) వరకు 80 వేల మంది స్త్రీ, పురుషులపై చేపట్టిన అధ్యయనంలో సుమారు 12% మంది ఆటో ఇమ్యూన్ వ్యాధి తో బాధపడుతున్నట్లు గుర్తించారు. PM2.5 కాలుష్య కణాలకు తక్కువ కాలం గురైతే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని అధ్యయనం నిర్ధారించింది.

Tags:    

Similar News