Rakesh Tikait: త్వరలోనే రైతులకు న్యాయం: రాకేష్ టికాయిత్

లక్నో: లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి తనయుడు అశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు..Latest Telugu News

Update: 2022-04-18 11:08 GMT

లక్నో: లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి తనయుడు అశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంపై భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్(Rakesh Tikait) హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన వాస్తవాలను సమర్పించలేదని సుప్రీంకోర్టు భావించింది. దీంతో బెయిల్ ను రద్దు చేసింది. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ హర్ నాథ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. కోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు చేసి, రద్దు చేసిందని చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుందని తెలిపారు. యూపీ సీఎం ఈ కేసులో నిష్పక్షపాత ట్రయల్ కు హామీ ఇచ్చారని అన్నారు.

మరోవైపు హింసాత్మక ఘటన లో మరణించిన రైతు కుమారుడు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, బాధ్యులు తప్పకుండా శిక్షింపబడతారని చెప్పారు. కాగా, అంతకుముందు అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా గతేడాది లఖింపూర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది చనిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News