Adult Acne: 30 ఏళ్ల తర్వాత పింపుల్స్ వస్తున్నాయా.. కారణాలివే?

ఆడవాళ్లకు పింపుల్స్ కావడం సర్వసాధారణం

Update: 2024-10-28 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆడవాళ్లకు పింపుల్స్(Pimples) కావడం సర్వసాధారణం. ముఖ్యంగా టీనేజ్(teenage) వయసులో మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. వయసు పెరిగే కొద్ది స్కిన్ మృదువుగా మారి.. ఆరోగ్యం(health)గా తయారవుతుంది. అయితే కొంతమందికి టీనేజ్ లో కూడా పింపుల్స్ కావు. అలాంటిది ముప్పై ఏళ్లు దాటిన వారిలో పింపుల్స్ అయితే మాత్రం తప్పకుండా కారణాలు అయ్యుండచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లలో వచ్చే పింపుల్స్ చాలా ఇబ్బంది పెడుతాయి. వీటినే హార్మోనల్ యాక్నె(Hormonal acne) అంటారు. అయితే ఈ వయసులో మొటిమలు కావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ముప్పై ఏళ్ల అనంతరం మొటిమలకు కారణాలు..

కొన్నిసార్లు మహిళల్లో ఈస్ట్రోజెన్(Estrogen), ఇతర హార్మోన్లు సరిగ్గా ఉత్పత్త కాకపోవడం కారణంగా హెచ్చుతగ్గులు జరుగుతాయి. దీంతో స్కిన్ పై పింపుల్స్ వస్తాయి. ఈ క్రమంలో మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు(Glycemic index foods) తీసుకోకూడదు. ఆవు పాలు, చక్కెర వంటివి మొటిమల సమస్యను పెంచుతాయి. శారీరకంగా ఒత్తిడికి లోనైతే కూడా రోగనిరోధక శక్తి (Immunity)బలహీనపడి.. పింపుల్స్ వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే డీహైడ్రేషన్(Dehydration), నిద్రలేమి, అనారోగ్యం, కాలుష్యం కారణంగా కూడా పింపుల్స్ సమస్య వస్తుంది.

పింపుల్స్ కు ఎలా చెక్ పెట్టాలి..?

కాగా పింపుల్స్ కు చెక్ పెట్టాలంటే ఆకుపచ్చ కూరగాయలు(green vegetables), కాయధాన్యాలు(Lentils) వంటివి తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకూడదు. వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తాగాలి. హార్మోన్ల అసమతుల్యత(Hormonal imbalance) వంటి సమస్యలను తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయాలి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News